Hyderabad: గత నెల రోజుల్లోనే హైదరాబాద్‌లో 20కి పైగా హత్యలు..ఈ నగరానికి ఏమైందీ!

-

గత నెల రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో 20కి పైగా హత్యలు చోటు చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ శాంతి భద్రతలు దిగజారుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికీ కనిపించని హోం మంత్రి.. ఇంత జరుగుతున్నా నివారించలేక పోతుంది పోలీస్ శాఖ. హైదరాబాద్‌ నగర వ్యాప్తంగా విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలు, యదేచ్చగా బైక్ రేసింగ్లు, రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు.


అటు గత నెల రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో 20కి పైగా హత్యలు జరగగా, ఎన్నో భౌతిక దాడులు జరిగాయి.. గతంలో ఎన్నడూ లేనంతగా రౌడీషీటర్లు రెచ్చిపోతున్నారు. విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు జరుగుతున్నాయి.. మైనర్ బాలురు వీటికి అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.. 10 రోజుల క్రితం గంజాయి తాగి మైనర్ బాలురు తమ స్నేహితుడిని చంపారు. రాత్రిపూట టీ-హబ్ కు వెళ్లాలంటే భయం కలిగేలా బైక్ రేసింగ్లు జరుగుతున్నాయి.. ఇంత జరుగుతున్నా పోలీసు శాఖ ఎందుకు వీటిని నివారించడం లేదు? అంటూ జనాలు ప్రశ్నిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version