నేడు నల్గొండ ఐటీ హబ్ ప్రారంభోత్సవం

-

ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో కేవలం హైదరాబాద్ మాత్రమే కాకుండా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే కేసీఆర్ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నల్గొండ జిల్లాలో నిర్మించిన ఐటీ హబ్​ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఐటీ టవర్‌ ప్రారంభంతో పాటు, పలు అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్వర్‌ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

నల్గొండ నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్న సీఎం కేసీఆర్.. పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రోడ్ల విస్తరణ, కూడళ్ల సుందరీకరణ, సమీకృత మార్కెట్ల నిర్మాణం చేయించారు. మర్రిగూడ కూడలిలోని పై వంతెనకు శంకుస్థాపన అనంతరం ఐటీ టవర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహావిష్కరణలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. సూర్యాపేటలో రూ.118 కోట్లతో నిర్మించిన ఎస్టీపీ, రూ.4 కోట్లతో నిర్మించిన మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌తో పాటు మహిళా కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించనున్నారు. తర్వాత పట్టణానికి చెందిన 804 మందికి రెండు పడక గదుల ఇళ్ల పట్టాలు అందించనున్నారు. అనంతరం ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version