కేటీఆర్ కు అరుదైన గౌరవం.. మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరు

-

మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశానికి హాజరుకానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా రావాలంటూ కేటీఆర్‌‌కు ఆహ్వానం అందింది. ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో జూన్ 20, 21 తేదీల్లో సమావేశాలు జరుగనున్నాయి. యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, ప్రస్తుత విద్యార్థులు, ప్రొఫెసర్లు, వివిధ దేశాల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

ktr

ఈ సందర్బంగా ఇండియా సాధిస్తున్న ప్రగతిని వివరించనున్నారు కేటీఆర్. కేటీఆర్ ప్రతిష్టాత్మక సమావేశానికి హాజరుకానున్నారు. 2025 జూన్ 20, 21 తేదీల్లో ఇంగ్లాండ్‌లో జరిగే ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరమ్ సదస్సుకు ముఖ్యవక్తగా పిలుస్తూ ఆ సంస్థ ప్రత్యేకంగా కేటీఆర్‌ను ఆహ్వానించింది. “భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు” అనే థీమ్‌తో ఈ సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు ఆక్స్‌ఫర్డ్ ఇండియా ఫోరం వ్యవస్థాపకులు సిద్ధార్థ్ సేఠీ తెలిపారు.

కేటీఆర్ తన అనుభవాలను, ఆలోచనలను అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ దేశాల నిపుణులతో పంచుకుంటే చర్చలు మరింత ఆసక్తికరంగా ఉంటడంతో పాటు భారతదేశ అభివృద్ధి ప్రస్థానంలో భాగం అవ్వడానికి వారందరికీ స్ఫూర్తిగా ఉంటుందని సిద్ధార్థ్ సేఠి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ సమస్యలను పరిష్కరించడంతో పాటు భారత్‌లోని స్థిరమైన అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా వక్తలు చర్చిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news