బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

-

బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్థన్ రెడ్డి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. తొలుత నాగం జనార్దన్ రెడ్డి తెలుగు దేశం పార్టీలో కొనసాగారు. అనంతరం బీజేపీలో చేరి.. మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించకపోవడంతో దానం నాగేందర్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.

ఊహించని విధంగా 2024లో బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అనూహ్య ఫలితాలను సాధించింది. ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. మాత్రం నాగం జనార్ధన్ రెడ్డికి మంచి పదవీ దక్కేది. ఇటీవల ఆయన అనారోగ్యానికి గురయ్యారు. గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్.  ఆరోగ్య సమస్య అనంతరం కోలుకుంటున్న నాగం జనార్ధన్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కేటీఆర్ వెంట పలువురు పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news