రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ఇ వాళ ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. 150 కోట్ల రూపాయల మేర జరిగే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. పాత కలెక్టరేట్ స్థానంలో 65 కోట్ల వ్యయంతో అన్ని వసతులతో కూడిన సమీకృత కలెక్టరేట్ సముదాయానికి శంకుస్ధాపన చేయనున్నారు. 38 కోట్ల 50 లక్షలతో జిల్లా పోలీస్ కార్యాలయం, 10 కోట్ల 4 లక్షల వ్యయంతో పోలీసుల నివాస భవన సముదాయానికి కూడా శంకుస్థాపన చేస్తారు.
కోటీ 25 లక్షలతో నిర్మించనున్న న్యూ మోడల్ బస్టాండ్ నిర్మాణ పనులకు, 50 లక్షలతో నిర్మించే సేవాలాల్ బంజార్ భవన నిర్మాణ పనులు, 10 కోట్లతో మేడారంలో శాశ్వత అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రామప్ప ఆలయాన్ని సందర్శించి..రుద్రేశ్వరస్వామి చెంత పూజలు చేస్తారు. అనంతరం…రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహించే …సాగునీటి దినోత్సవంలో పాల్గొంటారు. ములుగు పట్టణంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని….200 కోట్ల మేర ఐకేపీ మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ, గొల్ల కురుములకు రెండో విడత గొర్రెలు 125 యూనిట్లు పంపిణీ చేయనున్నారు.