సీఎం రేవంత్ రెడ్డి దేనికి భయపడుతున్నారు? అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం నుంచి బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కమాట కూడా రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘ప్రాజెక్టులను KRMBకి అప్పగించారు.
తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పూర్తిగా మౌనంగా ఉంటున్నారు. మీరు దేనికి భయపడుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలపై ప్రశ్నించకుండా ఈ లొంగుబాటు ఎందుకు?’ అని Xలో ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు దక్కింది జీరో అంటూ ఏర్పాటు చేసిన ఓ హార్డింగ్ ఫోటోను షేర్ చేశారు.