రుణమాఫీ చేస్తామని చెప్పి..రుణాలు వసూలు చేయండి అంటున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీరియస్ అయ్యారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గ కార్యకర్తలతో కేటీఆర్ మాట్లాడుతూ…రేవంత్ రెడ్డి 2 లక్షల రుణం తెచ్చుకోండి, అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తా అన్నాడు.. తుమ్మల నాగేశ్వర రావు రుణాలు వసూలు చేయండి, లేకుంటే కేసులు పెట్టండి అని అంటున్నాడని ఆగ్రహించారు.
ప్రియాంక గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామని చెబితే.. భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా భృతి ఇస్తామని చెప్పలేదని అబద్దం ఆడాడని ఆగ్రహించారు. రాహుల్ గాంధీ అదానీని తిడితే.. దావోస్‌లో రేవంత్ రెడ్డి, అదానీతో అలైబలై చేసుకుంటున్నాడని చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమే.. ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతున్నది. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గత పదేళ్ళలో తెలంగాణ తరుపున గళం విప్పింది మన బీఆర్ఎస్ ఎంపీలు అనే విషయం మరచిపోవద్దన్నారు.