కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రైతుల సాగునీటి కష్టాలపై ఆయన ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులంటే ఎందుకు చిన్న చూపని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట పొలాలు, రైతుల సమస్యలపై స్పందించారు. పంటలు ఎండుతున్నా రాష్ట్ర సర్కార్ పట్టించుకోవడం లేదని, ఇక ఇప్పుడు అంతో కొంతో కాపాడుకున్న పంటలు వడగండ్ల వల్ల నీటిపాలయ్యాయని వాపోయారు.
వడగండ్లు ముంచెత్తి రైతులను కడగండ్ల పాలు చేసినా సీఎం రేవంత్ కనీసం కన్నెత్తి చూడటం లేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయింపులు, పార్లమెంట్ ఎన్నికలపై ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థలపై లేదని మండిపడ్డారు. దిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా అని నిలదీశారు. అన్నదాతలకు జరుగుతున్న అన్యాయంపై భారత్ “రైతు” సమితి పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి గారు..
రైతులంటే.. మీకు ఎందుకింత చిన్నచూపు..?నిన్న.. పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు..
నేడు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడటంలేదు..ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప..
గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా…?
అన్నదాతల ఆర్థనాదాలు వినిపించవా..??ఎన్నికల గోల… pic.twitter.com/CUcrdomGku
— KTR (@KTRBRS) March 20, 2024