KTR: 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం..!!

-

6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు..6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం.. అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణలో విత్తనాల కొరతపై కేటీఆర్‌ స్పందిస్తూ.. పోస్ట్‌ పెట్టారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నం…విద్యుత్తు సబ్ స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నం…కాలిన మోటర్లు, పేలిన ట్రాన్స్ఫార్మర్లు చూస్తున్నం ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు-జనరేటర్ల మోతలు చూస్తున్నామని పేర్కొన్నారు.

సాగునీరు లేక ఎండిన పంట పొలాలు..ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు, చుక్కనీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులు, రైతుబంధు కోసం నెలలపాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేని దుస్థితి, పదేళ్ల తరువాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఇవాళ జోగిపేటలో.. విత్తనాల కోసం రైతుల మొక్కులు…క్యూలైన్ లో పాసుబుక్కులు చూసినం…! అన్నారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు..!
అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు..!! ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో..ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో..!!అంటూ పోస్ట్‌ పెట్టారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version