ktr on krishank arrest:క్రిషాంక్ అరెస్టు.. అక్రమం.. అన్యాయం.. దుర్మార్గం..అన్నారు కేటీఆర్. క్రిశాంక్ అంటే.. ఒక ఉద్యమ గొంతుక, ఒక చైతన్య ప్రతీక యువతరానికి ప్రతిబింబం అన్నారు. గల్లీ కాంగ్రెస్ వైఫల్యాలపై..ఢిల్లీ బీజేపీ అరాచకాలపై..గళమెత్తినందుకే ఈ దౌర్జన్యం..ప్రశ్నించినందుకే ఈ దుర్మార్గం అన్నారు. కాంగ్రెస్- బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు..మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.
ఈ నియంతృత్వ.. నిర్బంధాలకు..తెలంగాణ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు… నాడు ఎమర్జెన్సీ చూశాం .. నేడు అప్రకటిత ఎమర్జెన్సీ చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాసినందుకు ఆనాడు పాలక పక్షానికి పట్టిన గతే రేపు కాంగ్రెస్ కు పట్టడం ఖాయం.. తథ్యం..అన్నారు.