నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ కు లైన్ క్లియర్ అయింది. హైదరాబాద్ నగరం లో జోవో 118 కు మోక్షం కలిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 118 జీవో సమస్య పరిష్కారం అయిందని.. ఎన్నో ఏళ్లుగా వేలాది మంది ఇండ్లు రిజిస్ట్రేషన్ అవ్వక ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. నాగోల్ నుంచి lb నగర్ వరకు ఐదు కిలోమీటర్లు మెట్రో వెంటనే కలుపుతామని ప్రకటించారు.
ఇటు పెద్ద అంబరుపేట్ orr వరకు మెట్రోరైలు తెస్తామన్నారు. ఇస్నాపూర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు మెట్రోరైలు వస్తుందని… నమ్మశక్యం కానీ పనులు కూడా కేసీఆర్ పూర్తి చేసి నిరూపించారని వివరించారు. తెలంగాణ అలాగే సాధించారు…కాళేశ్వరం నిర్మాణం పూర్తి చేశారని కొనియాడారు. ఇంటి ఇంటికి నీళ్లు కూడా ముందు ఎవరూ నమ్మలేదు.. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ లు పూర్తి చేస్తున్నామన్నారు.lb నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగిందని వెల్లడించారు కేటీఆర్.