ఈ మహిళల స్కీంకు డిమాండ్.. 14 లక్షలకుపైగా అకౌంట్లు..!

-

కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. కేంద్రం తీసుకు వచ్చిన పథకాల వలన ఎన్నో లాభాలు ఉంటాయి. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ని తీసుకొచ్చింది కేంద్రం. కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 నుండి పోస్టాఫీసుల్లో ఈ స్కీమ్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత పలు బ్యాంకుల్లో కూడా ఈ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి అవకాశం ఇచ్చింది. ఇక మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ కి సంబంధించి మరిన్ని వివరాలు చూద్దాం..

ఇందులో రూ. 2 లక్షల వరకు ఒకేసారి డిపాజిట్ చేయాల్సి ఉంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ పీరియడ్ 2 సంవత్సరాలు. రెండేళ్ల తర్వాత పూర్తి డబ్బులకు వడ్డీ కలిపి ఇస్తారు. వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. దీనిలో మహిళలు మాత్రమే చేరేందుకు అర్హులు. ఎక్కువ మంది ఈ పథకం లో చేరుతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకొని ఈ స్కీమ్ ని లాంచ్ చేసారు. ఆ తరవాత మహిళ లు పెద్ద మొత్తంలో ఇందులో చేరుతున్నారు.

ఇప్పటివరకు ఏకంగా 14.83 లక్షల అకౌంట్లు ని తెరిచారు. ఏకంగా రూ.8630 కోట్ల మేర జమ అయ్యాయి. దీనిలో రూ.1000 డిపాజిట్ చెయ్యచ్చు. గరిష్టంగా రూ. 2 లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ స్కీం 2025 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఒకసారి రూ. 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే దీనిపై 7.5 శాతం వడ్డీ ప్రకారం ఏడాదికి రూ.15,427 లాభం వస్తుంది. రెండేళ్లకు చూస్తే రూ.32,044 వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version