ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ రాలేదు..తమ్మలే చెప్పారు – కేటీఆర్

-

20 లక్షల మందికి రుణమాఫీ కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి తమ్మల ప్రకటనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌. వందశాతం రుణమాఫీ పూర్తిచేశామని విర్రవీగిన ముఖ్యమంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయిందని సెటైర్లు పేల్చారు. ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తామని దగా.. మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం అంటూ మండిపడ్డారు.

ktr on runamafi over thummala

2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేంటి ?? అధికారిక లెక్కల ప్రకారమే.. 20 లక్షల అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికంగా రుణమాఫీ కాని రైతులందరో ?? అంటూ నిలదీశారు. చేస్తామన్న రుణమాఫీ ఇప్పటికీ పూర్తి చేయలేదు ఇవ్వాల్సిన రైతుబంధు సీజన్ ముగిసినా ఇయ్యలేదని ఆగ్రహించారు. రాబందుల ప్రభుత్వం ఉండి రైతులకు ఏం లాభం రేవంత్ చేతకానితనం.. అన్నదాతలకు కోలుకోని శాపం అంటూ ఫైర్‌ అయ్యారు కేటీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news