గాంధీ జయంతి నాడు..రేవంత్‌ పై ప్రస్తుత గాంధీలు చర్యలు తీసుకోవాలి – కేటీఆర్‌

-

గాంధీ జయంతి నాడు..రేవంత్‌ పై ప్రస్తుత గాంధీలు చర్యలు తీసుకోవాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్..ఈ సందర్భంగా మాట్లాడారు. ఈ గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఉన్న ప్రస్తుత గాంధీలు ఈ ప్రభుత్వ అమానవీయమైన పాలనపై స్పందించాలని కోరారు. డి పి ఆర్ అనేది లేకుండా ఇండ్లు కులగొట్టే దుర్మార్గమైన ప్రయత్నాలను విరమింపచేయాలని డిమాండ్‌ చేశారు. మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు కేటీఆర్‌.

ఈ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుంది ఈ అంశంలో పునరాలోచించుకోవాలని.. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు పేదలంతా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు కూల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కూలీలు కూడా ఇల్లు కూలగొట్టలేమంటూ మాతో తిరిగి వెళ్ళిపోయారు… ప్రజలు మిమ్మల్ని గెలిపించింది నిర్మాణాత్మక పనులు చేయమని కానీ విధ్వంసం సృష్టించమని కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. మేము రెండున్నర లక్షల ఇండ్లు కడితే మిమ్మల్ని అయిదు లక్షల ఇల్లు కట్టమని ఓటేసినారు కానీ ఉన్న ఇండ్లను కూలగొట్టమని కాదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news