టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేశారు. నంది నగర్ నివాసం లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన AEE (సివిల్) ఆశావాదులు…తమ సమస్యలను చెప్పుకున్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నోటిఫై చేసిన 1180 పోస్టులకు పరీక్షలు జరిగాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక జాబితాను పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని అభ్యర్థులు కేటీఆర్ గారి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో వెంటనే జాబితా విడుదల చేయాలని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ మహేందర్‌రెడ్డికి గారికి కేటీఆర్ గారు ఫోన్ చేసి కోరారు.
ఇక అటు హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై క్రిమినల్ కేసు నమోదు చేయటాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను బెదిరించే ఉద్దేశంతోనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా పాలనంటే ప్రశ్నించే ప్రజాప్రతినిధులపై అక్రమ కేసులు పెట్టటమేనా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.