మా మూడు ప్రధాన హామీల సంగతేంటి మోదీ జీ.. ప్రధాని నిజామాబాద్ పర్యటనపై కేటీఆర్ ట్వీట్

-

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ పర్యటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. మోదీ జీ.. మా మూడు ప్రధాన హామీల సంగతేంటి…??? అంటూ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. 1. మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు..?, 2. మా బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు..?, 3. మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు..?, మూడురోజుల వ్యవధిలో రెండోసారి వస్తున్న మోదీ జీ.. ఈ మూడు విభజన హక్కులకు దిక్కేది అని నిలదీశారు.

పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర.. మీ మనసు కరిగేదెప్పుడు.. తెలంగాణ గోస తీరేదెప్పుడు.. గుండెల్లో గుజరాత్ ను పెట్టుకుని తెలంగాణ గుండెల్లో గునపాలా.. కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారు. లక్షల ఉద్యోగాలిచ్చే ఐ.టీ.ఐ.ఆర్ ను ఆగం చేశారు. మా ప్రాజెక్టుకు జాతీయ హోదా హామీని తుంగలో తొక్కారు. దశాబ్దాలపాటు దగాపడ్డ పాలమూరుకు ద్రోహంచేసి వెళ్లిపోయారు. మీ పదేళ్ల పాలనలో.. 4 కోట్ల తెలంగాణ ప్రజల్నే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారు. అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

2022 కల్లా రైతుల ఆదాయం డబుల్ అన్న మోదీ జీ ఆ హామీ ఎక్కిడికి పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ప్రతి ఒక్కరికి సొంత ఇళ్లు.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు.. పెట్రోల్ ధరలు నియంత్రణ.. ఈ హామీలన్నీ ఏమైపోయాయని నిలదీశారు. తమ దోస్తుకు ఇచ్చిన హామీలు తప్ప .. దేశ ప్రజలకిచ్చిన ఒక్క మాటను నెరవేర్చరా..? అని ట్విటర్ వేదికగా కేటీఆర్ మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news