మేడిగడ్డ బ్యారేజీ ప్లానింగ్, డిజైన్, నిర్వహణ లోపాల కారణంగానే కుంగిందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ నివేదిక ఇవ్వడంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్నికల సమయంలో రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డపై రిపోర్ట్ ఇచ్చారని ఆగ్రహించారు మంత్రి కేటీఆర్.
గతంలో CWC చైర్మన్ ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణించలేదా? ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఇంజనీరింగ్ డిజాస్టర్ అయిందా? గతేడాది 28 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొని నిలబడింది’ అని తెలిపారు మంత్రి కేటీఆర్.
గత తొమ్మిదన్నరేళ్లలో కేసీఆర్ సర్కార్ రాష్ట్రంలో గుణాత్మక మార్పు తీసుకువచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా అవి అర్హులకు కచ్చితంగా అందేలా చూశామని వెల్లడించారు. కేసీఆర్ ప్రవేశపెట్టినన్ని పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టం చేశారు. తాము ప్రవేశపెట్టిన ఎన్నో కార్యక్రమాలను నేడు దేశం అనుసరిస్తోందని పురనరుద్ఘాటించారు.