ఎక్సిట్ పోల్స్ ఫేక్.. రాష్ట్రంలో కేసీఆర్ సారుదే సర్కార్ : కేటీఆర్

-

తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. అదంతా ఫేక్ అని.. పోలింగ్ పూర్తి కాకుండా ఎక్సీట్ పోల్స్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించారు. గత ఎన్నికల్లోనూ తమ పార్టీ ఓడిపోతుందని చెప్పారని కానీ ఏం జరిగిందో అంత చూశారని పేర్కొన్నారు. గత ఎన్నికల ఫలితాలే ఇప్పుడు కూడా రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాబోయేది కేసిఆర్ సర్కారెనని కేటీఆర్ అన్నారు.

‘ఈసారి 80కి పైగా స్థానాలు వస్తాయని అనుకున్నాం. కానీ 70 వస్తాయి. పోలింగ్ జరుగుతుండగానే ఎగ్జిట్‌ పోల్స్ సర్వే జరిగింది. ఎగ్జిట్‌ పోల్స్‌ చూసి కార్యకర్తలు ఆందోళన చెందవద్దు.2018లో BRS కు  50 స్థానాల కంటే ఎక్కువ రావని ఎక్సిట్  పోల్స్ చెప్పాయి. డిసెంబర్ 3న 70 కంటే ఎక్కువ స్థానాలు బీఆర్ఎస్కు తప్పక వస్తాయి. సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దు. కార్యకర్తలు, నాయకులు గందరగోళానికి గురి కవొద్దు. 100 శాతం అధికారంలోకి వస్తాం’. -కేటీఆర్, మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news