కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఏక్సిట్ పోల్స్ ఫలితాలు అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్నాయి. మినీ పార్లమెంట్ ఎన్నికలుగా జరిగిన ఈ పోలింగ్లో చాలా సర్వేలు అధికార బీఆర్ఎస్ కి వ్యతిరేకముగా వచ్చాయి.కొన్ని సర్వేలు కాంగ్రెస్ కి పట్టం కట్టారు. ముచ్చటగా మూడోసారి భారతీయ రాష్ట్ర సమితి గెలిచి హ్యాట్రిక్ కొడుతోందని ఆ పార్టీ నేతలు కుండబద్దలు కొడుతున్నారు.ఒకవేళ ఇదే జరిగితే దక్షిణ భారత దేశంలో ఏ పార్టీకి లేని రికార్డు బీఆర్ఎస్ కి దక్కే అవకాశం ఉంది.

ఇక ఈసారి ఒక్కసారి ఏక్సిట్ సర్వే చూస్తే….ఆరా సర్వే అధికార బీఆర్ఎస్ కి కష్టమే అని చెబుతోంది.కాంగ్రెస్ పార్టీకి 58నుంచి 67 స్థానాలు వస్తాయని వెల్లడించింది. ఇక్కడ అధికారం కాంగ్రెస్ కి దక్కుతుందండని కుండబద్దలు కొట్టింది. బీఆర్ఎస్ పార్టీ 41 నుంచి 49 స్థానాలు గెలవచ్చని చెబుతోంది. బీజేపీ 5-7,AIMIM కి 6-7 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు ఇద్దరు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే పేర్కొంది. ఆత్మసాక్షి సర్వే బీఆర్ఎస్ కి పట్టం కట్టింది.ఆ పార్టీకి 58-63 స్థానాలు వస్తాయాని చెప్పింది. 48-51స్థానాలలో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నులిస్తుండని, బీజేపీ 7-8,AIMIM 6-7 ఇతరులు ఒకరిద్దరు గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. నాగన్న సర్వే కూడా ఇక్కడ అధికార బీఆర్ఎస్ కి అధికారం కట్టబెట్టింది. ఆ పార్టీకి 61-68 సీట్లు వస్తాయని,కాంగ్రెస్ 34-40,బీజేపీ 3-5, AIMIM 5-6,ఇతరులు1-3 గెలిచే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి.

CNN IBN సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని చెప్పింది.బీఆర్ఎస్ కి 48,బీజేపీ కి 10,AIMIM5 సీట్లతో సరిపెట్టుకుంటుందని వెల్లడింఫించింది. C-ప్యాక్ సర్వే కూడా కాంగ్రెస్ కి అనుకూలంగానే పోల్స్ ఇచ్చింది. ఆ పార్టీ 65 సీట్లు,బీఆర్ఎస్ 45,బీజేపీ 4,MIM 5 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక థర్డ్ విజన్ సర్వే బీఆర్ఎస్ కి 61-68 స్థానాలు, కాంగ్రెస్ 34-40,బీజేపీ 3-5, MIM కు 5-8 స్థానాలు రావచ్చని అంచనా వేసింది.అంటే ఒకరిద్దరు మినహా అన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారం లోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి.

ఇక ఏక్సిట్ పోల్స్ పై మంత్రి తారక రామారావు స్పందించారు. ఇలాంటి సర్వేలు గతంలోనూ వచ్చాయని గుర్తుచేశారు. నాటితే అందుకు భిన్నంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది చెప్పారు. ఈ ఏక్సిట్ పోల్స్ సర్వేలను కార్యకర్తలు నమ్మవద్దని చెప్పారు. మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం పక్క అని చెబుతున్నారు.ఇక పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తాము ఉహించినట్టు కాంగ్రెస్ పారీ తెలంగాణాలో అధికారoలోకి వస్తుందని ధీమా వ్యక్తపరిచారు.మరి డిసెంబరు 3వ తేదీన ఓట్ల లెక్కింపులో ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టనున్నారో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news