కర్ణాటక ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉండదని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కర్ణాటక ప్రజలను రంజింపజేయడంలో కేరళ స్టోరీ ఎలా విఫలమైందో, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపవు అని వివరించారు.
నీచమైన & విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్ణాటక ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు కేటీఆర్. పెట్టుబడులు , మౌలిక సదుపాయాలను సృష్టించడం కోసం హైదరాబాద్ … బెంగళూరు ఆరోగ్యంగా పోటీ పడనివ్వండని కోరారు. కర్ణాటకలో కొత్త కాంగ్రెస్ ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.
అటు కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందించారు. కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన రాహుల్ గాంధీ.. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని వెల్లడించారు రాహుల్ గాంధీ. ప్రతి ఒక్కరు కష్టపడి కలిసిమెలిసి పనిచేశారు వారందరికీ నా కృతజ్ఞతలు.. కర్ణాటక ఎన్నికలలో పెట్టుబడిదారులకు పేదలకు మధ్య జరిగిన యుద్ధంలో పేదలు గెలిచారని వివరించారు.