తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కట్టే కాలే వరకు కేసీఆర్ తెలంగాణను దోచుకుంటూనే ఉంటారు. కేటీఆర్ బతుకు ఏంటో నాకు తెలుసు అంటూ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సిరిసిల్లలో మీడియాతో మాట్లాడారు.
అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించిన వాళ్లు, అయోధ్య అక్షింతలపై రాజకీయం చేసే వాళ్లను బహిష్కరించండి అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బండి సంజయ్.. కేటీఆర్ అసలు పేరు అజయ్ రావు.. టిక్కెట్ కోసం ఎన్టీఆర్ వద్దకు పోయి కేటీఆర్ పేరు మార్చాడు. కేసీఆర్ వి ఆలోచనలు అన్ని కొంప ముంచేవే..ముడతల చొక్కా.. రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోడు కేటీఆర్. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వేల కోట్లు సంపాదించారు. తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులను ఇచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ఎన్నికల కోడ్ సాకుతో హామీలను అమలు చేయకుండా దాటవేసే కుట్ర జరుగుతుందన్నారు.