బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చడంపై KTR సంచలన ప్రకటన చేశారు. బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గా మార్చడానికి కొన్ని సాంకేతిక పరమైన సమస్యలు ఉన్నాయని చెప్పారు. మారింది పేరు మాత్రమే జెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు, తెలంగాణతో మా పేగు బంధం ఎక్కడికి పోలేదని వెల్లడించారు కేటీఆర్. ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ కామెంట్స్ చేశారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ సంచలన అరోపణలు చేశారు. కాంగ్రెస్ మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేస్తున్నాడని వెల్లడించారు. వాళ్లు ట్యాపింగ్ చేయట్లేదు అని నిరూపించడానికి లై డిటెక్టర్ పరీక్షకు సిద్దంగా ఉన్నారా.. నేను సిద్ధం అంటూ సవాల్ విసిరారు కేటీఆర్.బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామనడానికి ఇవాళ వరంగల్ ఎంపీ అభ్యర్ధి ఎంపికే నిదర్శనం అన్నారు. వేరే పార్టీ నుండి ఇద్దరు వస్తామన్న 2001 నుండి పార్టీలో ఉండి కష్టపడి, చదువుకున్న, ఉద్యమ నాయకుడికి అవకాశం కల్పించారు కేసీఆర్ గారు అని చెప్పారు కేటీఆర్.