రేవంత్.. నువ్వు మొగోనివే అయితే నువ్వు ఏసీబీ పంపించు మెగా ఇంటి మీదికి అని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాజాగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మెగా ఇంజనీరింగ్ మీద, సుంకిశాలలో గోడ కూలిపోయింది.. ఇంటెక్ వేల్ మొత్తం కూలిపోయింది రూ.80 కోట్ల నష్టం జరిగిందని.. మొగోనివే అయితే పంపు ఏసీబీని మెగా కృష్ణారెడ్డి మీదికి పంపు చూస్తా.. దమ్ము ఉందా..? అంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
“నా మీద ఎందుకు కేస్ పెడతారు. హైదరాబాద్ ను అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకు పెడతావా? లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినందుకా? బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించినందుకా? ఎందుకు కేసు పెడతావు అని ప్రశ్నించారు. నాపై కేసు పెడితే భయపడను. నేను భయపడేటోడిని కాదు.. జైలుకు పోతే మంచి యోగా చేసి ఫిట్ గా తయారై వచ్చి పాదయాత్ర చేస్తా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్.