కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈనో ప్రచారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దావోస్
పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు స్పందిస్తూ.. కేటీఆర్ కు కడుపు మంటగా ఉందని, ఆయన ఈనో తాగి ప్రశాంతంగా ఉండాలని ప్రచారం చేశారు. అంతేగాక నగరంలో పలు చోట్ల కేటీఆర్, కేసీఆర్ ఈనో తాగాలంటూ హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీనిపై తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకులు మొత్తం అబద్దాలే మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
నిన్న, మొన్న కేటీఆర్ ఈనో తాగాలి అని బయట అడ్వర్టైజ్మెంట్లు పెట్టారని అన్నారు. ఈ కాంగ్రెస్ సిపాయిలు పెట్టుబడులు తెచ్చారని చెప్పి, నాకు అజీర్తి అయ్యిందని ఈనో తాగాలని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు పెట్టుబడులు వచ్చి, ఉద్యోగాలు వస్తే సంతోషిస్తామని, అవన్నీ అవాస్తవాలు అనే విషయం ప్రజలకు తెలుసని చెప్పారు.