వక్ఫ్ బోర్డు అధికారాలకు కోత పెడుతూ మోడీ సర్కార్ తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ ఇవాళ సమావేశమైన పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యులు ప్రతిపాదించిన మొత్తం 14 సవరణలను జేపీసీ ఆమోదించింది. మొత్తం 44 మార్పులు సూచించారని.. ప్యానెల్ చైర్మన్ జగదాంబిక పాల్ వెల్లడించారు.
ఈ సవరణ చట్టాన్ని మరింత శక్తిమంతంగా మారుస్తాయనే ఆశాభావం వ్యక్తం చేసారు. కమిటీలో ఎన్డీఏ సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించగా.. విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరనకు గురయ్యాయి. వీటిపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్య పద్దతిలో కమిటీ పని చేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. మొత్తానికి జేపీసీ సూచించిన 14 ప్రతిపాదన ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్ జరుగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్ సభకు అందజేయనున్నట్టు సమాచారం.