భవిష్యత్ లో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సెటైర్లు వేశారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. సంగారెడ్డి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు రాజకీయాలు బంద్ చేయాలని ఉందని కేటీఆర్ అంటున్నారు. అలాంటప్పుడు రాజకీయాలు బంజెయి.. ఎవ్వరు వద్దన్నరు. వెళ్లి అమెరికాలో బాత్ రూమ్ లు కడుక్కో.. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలకు కలిసే సమయం దొరకడం లేదు.
మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఏమైనా నష్టం జరిగిందా..? అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను పాదయాత్ర చేయాలని అడిగింది ఎవరు అని నిలదీశారు. సిరిసిల్ల ప్రజలు పాదయాత్రను అడగలేదని.. సిద్దిపేట ప్రజలు అంతకంటే అడగలేదన్నారు. ఎవరి కోసం ఎందుకోసం ఈ పాదయాత్ర చెప్పాలన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ పంచాయతీ నుంచి బయటపడేందుకు కేటీఆర్ పాదయాత్ర అంటున్నారని రఘునందన్ రావు విమర్శించారు.