కేటీఆర్ మెడలో చెప్పుల దండ వేయాలి: షబ్బీర్ అలీ

హుజరాబాద్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ కేటిఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి పదవి తన కాలి చెప్పు తో సమానం అన్న కేటీఆర్ మెడలో చెప్పుల దండ వేయాలన్నారు. కెసిఆర్ కుటుంబం నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. విద్యార్ధుల ఆత్మహత్యలకు చలించిపోయి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. కెసిఆర్ మాత్రం విద్యార్థులను అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారు అని మండిపడ్డారు. వరంగల్ లో జరిగే రాహుల్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అలాగే కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలను అణచి వేసిన చంద్రబాబును మించిన నియంత కేసిఅర్ అని అన్నారు పొన్నం ప్రభాకర్. ఓయూ లో రాహుల్ గాంధీ పర్యటన కు పర్మిషన్ ఇవ్వడం లేదని, విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్తామంటే పర్మిషన్ ఇవ్వరా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.విద్యార్ధుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో విద్యార్థులను అక్రమంగా అరెస్టు చేస్తూ.. కెసిఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు అని మండిపడ్దారు.