ఇవాళ సిరిసిల్లలో పర్యటించనున్న కేటీఆర్.. షెడ్యూల్ ఇదే

-

 

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రివర్యులు శ్రీ కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని పలు మండలాల్లో ప్రారంభానికి సిద్ధమైన అంబేద్కర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.ఉదయం 10.30 గంటలకు చీర్లవంచలో అంబేద్కర్, చాకలి* *ఐలమ్మ విగ్రహావిష్కరణ,ఎస్సి,ముదిరాజ్ కమ్యూనిటీ హల్ కు శంకుస్థాపన సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ పాల్గొంటారు.

ఉదయం 11.30 గంటలకు పాపాయపల్లె గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవం,మధ్యాహ్నం 12 గంటలకు  గోపాల్ రావు పల్లెలో అంబేద్కర్  విగ్రహావిష్కరణ,మధ్యాహ్నం 1 గంటలకు తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ,మధ్యాహ్నం 1.30  గంటలకు గండిలచ్చ పేటలో అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహావిష్కరణ, కేసీఆర్ ప్రగతి ప్రాంగణం,దళిత బంద్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్ ప్రారంభోత్సవం. దళితబంధు లబ్ధిదారులతో కలిసి లంచ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు గంభీరావుపేట మండలం గోరంట్యాలలో అంబేద్కర్  విగ్రహావిష్కరణలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు.

 

Read more RELATED
Recommended to you

Latest news