రూ.210 పెట్టండి చాలు… ప్రతి నెలా రూ.5000 పెన్షన్‌..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. ఈ స్కీముల వలన చాలా మందికి ఎన్నో రకాల లాభాలని పొందుతున్నారు. వివిధ రంగాలలో ఆర్థికంగా ఎదగడం నుంచి పెన్షన్‌ తీసుకునే వాళ్ళ వరకు కూడా ఎన్నో స్కీములని తీసుకు వస్తూనే ఉంది కేంద్రం. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీముల లో అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్‌ కూడా ఒకటి. మరి ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… గత ఆర్థిక సంవత్సరంలో అటల్ పెన్షన్ యోజన కింద మొత్తం చందాదారుల సంఖ్య 1.19 కోట్లని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ చెప్పింది.

ఈ స్కీమ్ లో కనుక చేరితే నెలకు రూ.5 వేలు పొందవచ్చు. ఈ స్కీమ్ లో మీరు కనీసం రూ.1000 పింఛను ని పొందొచ్చు. ఈ స్కీమ్ లో 18 – 40 సంవత్సరాల వయసు కలిగినవారు చేరడానికి అర్హులు. ఈ స్కీమ్ లో 40 సంవత్సరాలు దాటితే చేరేందుకు అవకాశం ఉండదు. ఈ స్కీమ్ లో మీరు నెల నెలా కొంత మొత్తం నగదును చెల్లించాల్సి వుంది. మీరు కట్టే దాని బట్టీ పెన్షన్ ఆధార పడి ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల్లోపు ఏ వయసులోనైనా అటల్ పెన్షన్ యోజనలో చేరచ్చు. అరవై ఏళ్ళు దాటితే పెన్షన్ వస్తుంది.

నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్‌ ని ఈ స్కీము కిందన పొందొచ్చు. 60 సంవత్సరాల వయసు దాటినా వాళ్ళు రూ.1000 పెన్షన్‌ కావాలంటే నెలకు రూ.42 చెల్లించాల్సి వుంది. అదే నెలకు రూ.3000 పెన్షన్‌ కావాలంటే రూ.126, రూ.5000 పెన్షన్‌ కావాలంటే నెలకు రూ.210 చెల్లించాల్సి వుంది. 40 ఏళ్ల లో ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.1000 పెన్షన్‌ కావాలంటే నెలకు రూ.291 చెల్లించాల్సి ఉంటుంది. రూ.2000 పెన్షన్‌ కోసం రూ.582, రూ.5000 పెన్షన్‌ కోసం రూ.1454 చెల్లించాల్సి వుంది. నామినీకి చివరలో ఒకేసారి రూ.8.5 లక్షల దాకా వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news