ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ : కేటీఆర్

-

పార్టీ ఫిరాయింపులను ప్రారంభించిందే కాంగ్రెస్‌ పార్టీ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను కాంగ్రెస్‌ ప్రోత్సహించిందని తెలిపారు. ఆయారాం.. గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్‌ అని వ్యాఖ్యానించారు. దిల్లీలో మాజీ మంత్రి హరీశ్ రావుతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్‌కు ప్రజలు 9 సార్లు అధికారమిచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ చేసిన అన్యాయానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఉద్యమించారని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ ఫలితంగా కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం సిద్ధించిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో మొదటి పదేళ్లు కేసీఆర్‌ నేతృత్వంలో మంచి పాలన అందిందని తెలిపారు. 2023 ఎన్నికల్లో కేవలం 4 లక్షల ఓట్లతోనే అధికారం కోల్పోయామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి సంతకంతో ఆరు గ్యారంటీల పత్రాన్ని తయారు చేశారన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారని.. కానీ ఇప్పుడు ఆ ఊసే లేదని ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news