కేటీఆర్.. తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగమేంటో చెప్పాలి : మహేష్ కుమార్ గౌడ్

-

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 50వేల ఉద్యోగాలు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే 50వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రంగాలలో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందని అన్నారు. ప్రజాపాలన పండుగలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాన ఆసుపత్రుల్లో సౌకర్యాలను మెరుగు పరుస్తున్నామని తెలిపారు. పదేళ్ల పాలనలో మీరు చేసిన దోపిడీ అంతా ఇంతా కాదు అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని.. రూ.లక్షల కోట్లు కొల్లగొట్టిన మీకు మళ్లీ అధికారం ఎందుకు ఇస్తారు అని ప్రశ్నించారు. సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నన నేపథ్యంలో తెలంగాన ప్రజల యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతికి అద్దంపట్టే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉ:టుందని తెలిపారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ పేర్కొంటున్నారు. రాజీవ్ చేసిన సేవల గురించి కేటీఆర్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version