న్యాయ్‌ పేరుతో రాహుల్‌ గాంధీ నయా నాటకానికి తెరతీశారు : కేటీఆర్‌

-

కాంగ్రెస్‌ జనజాతర సభపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. జనజాతర సభ కాదని, హామీల పాతర అని అబద్ధాల జాతర సభ అంటూ ఫైర్‌ అయ్యారు. రాహుల్ గాంధీ .. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరిట గారడి చేశారని.. పార్లమెంట్ ఎలక్షన్లలో.. న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారా..? అని నిలదీశారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని అన్నారు. నమ్మి ఓటేసిన నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా నయవంచన చేస్తోంది కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.

“అసత్యాలతో అధికారంలోకి వచ్చి.. అన్నదాతలను ఆత్మహత్యల పాల్జేస్తోంది. నేతన్నల బలవన్మరణాలకు కారణమవుతోంది. గ్యారెంటీలకు పాతరేసి… అసత్యాలతో జాతర చేస్తోంది. తెలంగాణ ఎన్నికల ప్రచారం సందర్భంగా.. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు. అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనలో… సాగునీరు లేక అన్నదాతలు పంట నష్టపోతున్నారు. రుణమాఫీ లేక రైతులు అప్పుల పాలవుతున్నారు. తాగునీటికి తెలంగాణ ప్రజలు తండ్లాడుతున్నారు. మీ మోసాలపై మహిళలు మండిపడుతున్నారు. రాహుల్ జీ.. మా అన్నదాతల ఆర్థనాదాలు వినిపించడం లేదా..? లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినా స్పందించరా ?” అంటూ కేటీఆర్ ఎక్స్ లో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news