కేసీఆర్ గారు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టాల్సింది అంటూ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత…ప్రజలు అనేక సమస్యలకు లోనవుతున్నారు.
పెన్షన్లు, రైతు బంధు అందక ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఈ అంశంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ గారు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టాల్సింది అంటూ తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. చాలా ఆసక్తికరమైన అభిప్రాయాలు & పరిశీలనలు నేను ఎన్నికల తర్వాత చూస్తున్నాను.. కేసీఆర్ గారు 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు 32 యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలసిందని తెలిపారు కేటీఆర్. ఒక స్థాయి వరకు ఈ అబ్సర్వేషన్ ని ఏకీభవించాలన్నారు కేటీఆర్.