మానవత్వం చాటుకున్నారు బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆక్సిడెంట్‌కు గురైన వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆస్పత్రికి తరలించారు కేటీఆర్. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి ఆక్సిడెంట్‌కు గురై రోడ్డుపై కిందపడి ఉన్నాడు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార నిమిత్తం అటుగా వెళ్తున్న కేటీఆర్ అతన్ని చూసి తన కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ కారులో అత్యవసర చికిత్స కోసం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించాడు. కాగా ఎంజీఎం సంఘటనపై కేటీఆర్ స్పందించారు. ఎంజీఎం ఆస్పత్రిలో 5 గంటల విద్యుత్ కోత బాధాకరం అని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
ఆస్పత్రులను కూడా ఈ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని మండిపడ్డారు. కరెంటు కోతలు లేవని సీఎం, మంత్రులు పదేపదే అంటున్నారని.. ఆస్పత్రుల్లో కరెంట్ కోతలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని కేటీఆర్ ప్రశ్నించారు.