తెలంగాణా ఐటి శాఖా మంత్రి కేటిఆర్ తన శాఖలోనే కాదు ఇతర శాఖల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రభుత్వ యంత్రాంగం మీద ఆయనకు పూర్తి పట్టు ఉంటుంది. ఆయన ఆలోచనలు చాలా మంది కీలక అధికారులు కూడా అమలు చేయడమే కాదు ఆయన ఆలోచనలను ముందుకు తీసుకుని వెళ్ళడానికి ప్రత్యేక ప్లానింగ్ కూడా చేస్తూ ఉంటారు. తెలంగాణాలో ఐటి శాఖను కేటిఆర్ చాలా వరకు బలోపేతం చేసారు. ఐటి రంగంలో ఆయన చేసిన ఆలోచనలు విదేశీ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించాయి.
ఇప్పుడు ఇదే కేంద్రానికి కూడా ఎక్కువగా నచ్చింది అంటున్నారు. ఇప్పుడు ఆయనకు ఒక కీలక పదవి ఇచ్చే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. దేశంలో ఐటి నిపుణులు, మంత్రులతో కలిసి ఒక కమిటి వేస్తుంది. అధికారులు మంత్రులతో కలిసి ఈ కమిటి ఉంటుంది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఐటి రంగం దాదాపుగా పతనం అయ్యే పరిస్థితిలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. దీన్ని బలోపేతం చేసే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. అందుకే ఒక కమిటి వేసి ప్రతిభ ఉన్న నాయకులను, నిపుణులను తీసుకునే ఆలోచనలో ఉంది.
హైదరాబాద్ ఐటి రంగంలో చాలా కీలకంగా ఉంది. ఐటి రంగాన్ని ఇక్కడ ముందుకు తీసుకుని వెళ్ళాలి అంటే మంత్రులు కూడా సమర్ధవంతంగా ఉండాలి. ఈ విషయంలో కేటిఆర్ కి వందకు 95 మార్కులు పడ్డాయి. అందుకే ఇప్పుడు ఆయనను వాడుకునే ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం. ఆ కమిటికి కేటిఆర్ ని చైర్మన్ ని చేయడమే కాకుండా దక్షినాది రాష్ట్రాల ఐటి మీద ఆయనకు కొన్ని బాధ్యతలను కూడా అప్పగించే ఆలోచనలో కేంద్ర సర్కార్ ఉంది. త్వరలోనే ఈ కమిటిని ఏర్పాటు చేస్తుంది అని సమాచారం.