మంత్రి పొంగులేటి నియోజకవర్గంలో భూకబ్జాలు తెరపైకి వచ్చాయి. దీంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం చేసుకుంటే..పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మాజీ నక్సలైట్ అని చెప్పుకొని భూకబ్జాలు చేస్తున్నారు జాటోత్ వీరన్న. కానీ దీనిపై పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.
పాలేరు నియోజకవర్గంలోని జాన్ పహాడ్ తండాలో ఏలేటి వెంకట్ రెడ్డి అనే రైతు సోదరుడు భూపాల్ రెడ్డి భూమిని పలు వాయిదాల కింద డబ్బులు ఇస్తానంటూ అక్రమంగా భూమిని కబ్జా చేశాడట జాటోత్ వీరన్న. అయితే…. ఈ పొలం వివాదంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు భూపాల్ రెడ్డి. పక్కనే ఉన్న ఏలేటి వెంకట్ రెడ్డికి చెందిన మూడు ఎకరాల భూమిని, ఇదే తాను కొన్న భూమి అంటూ అక్రమంగా కబ్జా చేశాడట జాటోత్ వీరన్న.
కబ్జా చేసిన భూమిలో పంట వేస్తానని ట్రాక్టర్ పెట్టి దున్నాడట జాటోత్ వీరన్న. పోలీస్ స్టేషన్లో దీని మీద ఫిర్యాదు ఇస్తే పట్టించుకోవడం లేదని, తన భూమి వేరే వాళ్ల చేతిలోకి పోయిందని తీవ్ర మనస్తాపానికి గురై తన సోదరుడిలాగే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఏలేటి వెంకట్ రెడ్డి.