మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దెబ్బకు దిగి వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖకు తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన వచ్చింది. నేటి నుండి మిడ్ మానేరు ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ప్రారంభం కాబోతుంది. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లకు నీటి విడుదల చేస్తున్నట్లు ప్రకటన చేసింది తెలంగాణ రాష్ట్ర సర్కార్.
నీళ్లు లేక వెలవెలబోతున్న జిల్లాలోని రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలను ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవాలని రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్రాసిన లేఖకు ప్రభుత్వం నుండి స్పందన వచ్చింది. లేఖ అందిందంటూ హరీష్ రావుకి స్పష్టం చేశారు నీటి పారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా. నేడు నీరు విడుదల అవుతున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర రైతులు.