తెలంగాణ విద్యార్థులకు శుభవార్త…లాసెట్ కౌన్సెలింగ్ దరఖాస్తు గడువు పెంపు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త అందింది. లా సెట్ కౌన్సిలింగ్ దరఖాస్తు ఫీజు గడువులు పెంచుతూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ దరఖాస్తు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Lasset counseling application deadline extended

ఈ దరఖాస్తు గడువును నవంబర్ 23వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారిక ప్రకటన చేసింది. అయితే నవంబర్ 21వ తేదీన గడువు ముగియాల్సి ఉంది. కానీ రెండు రోజులపాటు ఆ గడువును పెంచింది. దీంతో లాసెట్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ విద్యార్థుల బ్యాక్లాగ్ రిజల్ట్స్ ఇంకా రాకపోవడంతో…. వారు ఇచ్చిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొంతమంది చెబుతున్నారు. ఇక లా సెట్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు నవంబర్ 30వ తేదీన సీట్లు కేటాయిస్తారు. ఇక డిసెంబర్ 4వ తేదీ నుంచి అంటే ఎలక్షన్ రిజల్ట్ వెలువడిన తర్వాత క్లాసులు ప్రారంభమవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news