సాక్షి యాజమాన్యానికి నోటీసులు -ఎంపీ రఘురామ

-

 

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం చెప్పింది ఒకటైతే, సాక్షి దినపత్రిక రాసింది మరొకటి అని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుఎద్దెవా చేశారు. న్యాయస్థానాలను ప్రజలు అపార్థం చేసుకునే విధంగా సాక్షి రాతలు ఉన్నాయని ఆయన మండిపడ్డారు.సాక్షి దినపత్రికలో రాసిన రాతల కంటే కొంత వరకు సకల శాఖా మంత్రి సజ్జల రామకృష్ణా రెడ్డి గారు మాట్లాడిన మాటలే నయమని అన్నారు.

raghurama

సాక్షి రాతలు మరింత రోతగా ఉన్నాయన్న ఆయన, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారని, మరి సాక్షి చైర్ పర్సన్ పైన లేక మరెవరిపైన చర్యలు తీసుకుంటారో చూడాలని అన్నారు. సాక్షి దినపత్రిక రాతలకు సుమోటో గా న్యాయస్థానం ఆ పత్రిక యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని, ఒకవేళ కోర్టు తీర్పు నచ్చకపోతే పై కోర్టుకు అప్పీల్ కు వెళ్లాలి కానీ… న్యాయమూర్తి గారు ఇచ్చిన తీర్పుపై ఇష్టా రీతిలో వ్యాఖ్యానాలు చేయడం ఏమిటంటూ రఘురామకృష్ణ రాజు గారు మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ కేసులో బెయిల్ మంజూరు చేయడంపై న్యాయ వర్గాలు విస్మయం వ్యక్తం చేశాయని సాక్షి దినపత్రికలో రాశారని, అసలు ఎవరా న్యాయవర్గాలు? అంటూ రఘురామకృష్ణ రాజు గారు నిలదీశారు. కోర్టు నోటీసులు జారీ చేసిన తరువాత విస్మయం వ్యక్తం చేసిన ఆ న్యాయ వర్గాలు ఎవరో చెబుతారా అంటూ ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news