తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ నోటిఫికేషన్, ఎన్నికల తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల జాబితాకు తుది మెరుగులు దిద్దుతున్నాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిపై కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది.
దాదాపు రేపు అభ్యర్దుల జాబితా ఖరారు కానున్నది. చివరి నిముషంలో మరికొన్ని చేరికలుండే అవకాశం ఉంది. రేపు సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధులను “కేంద్ర ఎన్నికల కమిటీ” ఖారారు చేసినా, “బస్సు యాత్ర” తర్వాతే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 14 తర్వాత మరికొన్ని చేరికలు ఉంటాయి. దాదాపు ఒకేసారి అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. రేపటి “కేంద్ర ఎన్నికల కమిటీ” సమావేశానికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్.పి నాయకుడు భట్టి, తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి థాక్రే హాజరు కానున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. 4 స్థానాలు తప్ప.. బీజేపీ ఈనెల 16న ప్రకటించే అవకాశముంది.