నేడు AICCకి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా!

-

నేడు AICCకి కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెళుతుందని సమాచారం అందుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. ఈ నెల 16న హైదరాబాద్ వేదికగా నిర్వహించే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు.

CWC సమావేశ వేదికను ఖరారు చేయనున్నారు. ఇవాళ మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బేటి కానుంది. దరఖాస్తుల నుంచి ప్రాథమికంగా నిర్ణయించిన అభ్యర్థుల జాబితాను AICCకి పంపే అవకాశం ఉంది. కాగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలని హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ సమావేశాలు సెప్టెంబర్ 16న జరగనున్నాయి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే..ఇలా చాలామంది జాతీయ నేతలు రానున్నారు. సెప్టెంబర్ 17న భారీ సభ జరగనుంది. ఈ సభలో పలు కీలక హామీలు ఇవ్వనున్నారు. ఈ హామీలతో ప్రజలని ఆకట్టుకోవాలనేది కాంగ్రెస్ మొదటి ప్లాన్.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version