Telangana : రెండు రోజుల్లో 94 వేల మందికి రుణమాఫీ

-

Telangana : తెలంగాణ రైతులకు అలర్ట్‌. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. తొలిరోజు రూ. 41 వేలలోపు రుణాలున్న 62, 758 మందికి రూ. 237 కోట్లను, రెండో రోజు రూ. 41 వేల నుంచి రూ. 43 వేల మధ్య రుణాలున్న 31, 339 మందికి రూ. 126 కోట్లను ప్రభుత్వం మాఫీ చేసింది.

రెండు రోజుల్లో 94,000 మందికి రూ. 364 కోట్ల ప్రయోజనం చేకూరింది. కాగా, రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 18, 241 కోట్లను విడుదల చేయగా, SEP రెండో వారంలోగా ప్రక్రియ పూర్తి కానుంది. కాగా, రైతు బీమాకు అర్హులైన రైతులు సంబంధిత అధికారులకు కావలసిన పత్రాలను సమర్పించి దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు. ఈ ఏడాది జూన్ 18 లోపు పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన వారిలో 18 నుంచి 59 ఏళ్ల వయసు గలవారు తమ గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారికి దరఖాస్తు ఇవ్వాలి. తద్వారా వారికి ఆగస్టు 13 నుంచి ఏడాది పాటు జీవిత బీమా ఉంటుంది. ఏ కారణంగా చనిపోయిన రూ. 5 లక్షల పరిహారం అందుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news