రాహుల్ గాంధీ కి మరో శుభవార్త..లోకసభ సభ్యత్వం పునరుద్దరణ కానున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్ష పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. సూరత్ కోర్టు తీర్పు పై తాజాగా స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక రాహుల్ గాంధీకి సుప్రీంలో భారీ ఊరట లభించడంతో సోమవారం నుంచి పార్లమెంటుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సుప్రీం ఆదేశాల మేరకు ఆయనపై విధించిన సస్పెన్షన్ ను లోక్ సభ సచివాలయం తొలగించాల్సి ఉంది. నేడు లేదా రేపటిలోగా MP అభ్యర్థిత్వాన్ని పునరుద్ధరిస్తే రాహుల్ సోమవారం పార్లమెంటుకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, మోడీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది.