మేడిగడ్డ ప్రాజెక్టు ఎల్ &టి కంపెనీ సబ్ కా oట్రాక్టు ను బెదిరించి ఇప్పించు కున్నాడని బండి సంజయ్ అన్నాడని మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. అతను అన్న మాజీ ఎంపీ ఎవరో బండి సంజయ్ పేరు చెప్పాలి కదా? అని ప్రశ్నించారు. ఎల్ & టి మల్టీ నేషనల్ సంస్థ సబ్ కాంట్రాక్టు ఇవ్వదు.. ఎంపీ బండి సంజయ్ కు ఈ విషయం తెలియదు అన్నారు. అసెంబ్లీ సెషన్స్ కు కేసీఆర్ త్వరలోనే హాజరవుతారు అని తెలిపారు.
ఐదు సంవత్సరాలలో ప్రజలకు నువ్వేం చేసావు అని అడిగితే.. నెహ్రూ కాలంలో అమలైనా జాతీయ ఉపాధి హామి పథకాల పోస్టర్స్ వేసుకున్నాడు బండి సంజయ్. రేవంత్ రెడ్డి మేడి గడ్డ కు నేడు వెళ్తున్నారు. లోపాలపై ఎవరి తప్పిదం అనేది తేల్చండి మాకు సమ్మతమే. పార్టీ సిద్ధాంతాల లిమిట్స్ లో కూడా బండి సంజయ్ లేడు అన్నారు. ఏ కాంట్రాక్టరుకు ఏనాడు నెను ఫోన్ చేయలేదు. పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి.ఏ,బీ,సీ,డీ లు కూడా రాని బండి సంజాయ్,అవాక్కులు పేలుతున్నాడు. బండి సంజయ్ కరీంనగర్ ప్రజల సమస్యల కోసం ఏ అధికారి దగ్గరికైనా వెళ్లాడా?అని ప్రశ్నించారు.