సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుండి టీపీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహేష్ గౌడ్ కీలక కమిన్స్ చేసారు. గాంధీ భవన్ దేవాలయం తో సమానం. కార్యకర్తలు దేవుళ్ళు..సోనియా గాంధీ దేవత.. నాకు మార్గదర్శి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని టీపీసీసీ చీఫ్ పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాషా వల్లనే గాంధీ అలా వ్యవహరించారు. రోశయ్య ప్రసంగం లాగా ఉండాలి. వైరి వర్గాలు ఉంటాయి. కానీ భాషా బాగుండాలి. సీఎం రేవంత్ ది దెబ్బకు దెబ్బ అనే స్టైల్. అందుకే మనం అధికారం లోకి రాగలిగాము అని అన్నారు మహేష్ గౌడ్.
ఇక హైడ్రా అనేది ఓ మంచి నిర్ణయం. ఎవరు సలహా ఇచ్చారో కానీ అది అద్భుతం. గాంధీ భవన్ ఉంటేనే మనం. ఇక నుండి గాంధీ భవన్ కి ప్రతి వారం ఇద్దరు మంత్రులు రావాల్సిందే. గాంధీ భవన్ కి ప్రజలు.. కార్యకర్తలు వస్తారు. ఇక సీఎం నెలలో ఒక రోజు గాంధీ భవన్ కి రండి అని కోరారు కొత్త చీఫ్ మహేష్ గౌడ్.