BREAKING : మరింత క్షీణించిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం !

-

BREAKING : బిజెపి నేత, మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని బిజెపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన గత 5 రోజుల నుంచి ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు.

ఇక ప్రస్తుతం ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఈ తరుణంలోనే.. నేడు మహారాష్ట్ర నాందేడ్ జిల్లా ముక్కెడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే తుషార్ గోవింద్ రావు రాథోడ్ గారు మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు. పోలీసుల లాఠీ ఛార్జ్ ను తీవ్రం గా ఖండించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దిగిరావాలని తక్షణమే G.O 220 మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news