బ్లాక్ శారీలో శ్రీలీల.. సో బ్యూటీఫుల్.. సో ఎలిగెంట్

-

టాలీవుడ్​ మోస్ట్ హాప్పెనింగ్ హీరోయిన శ్రీలీల సోషల్ మీడియాలోనూ చాలా పాపులర్. ఈ భామ ప్రస్తుతం సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్​తో బిజీబిజీగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్​కు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది. ఈ భామ ఔట్​ఫిట్స్ చూసి అమ్మాయిలు అదరహో అంటున్నారు. ఇక శ్రీలీల అందం చూసి అబ్బాయిలు మాత్రం మనసు పారేసుకుంటున్నారు.

తాజాగా శ్రీలీల బ్లాక్ కలర్ శారీలో ఫొటోలను తన ఇన్​స్టా ఖాతాలో పోస్టు చేసింది. ఈ ఫొటోలు పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్ అయ్యాయి. ఇక లైకులు, కామెంట్ల వర్షం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. మా విజ్జీ పాప చీరలో భలే ముద్దుగా ఉందంటూ కుర్రాళ్లు కొంటె కామెంట్లు చేస్తున్నారు. నడుం అందాలు చూపిస్తూ మనసు కొల్లగొడుతోందని మరికొందరు మనసిచ్చేస్తున్నారు ఈ భామకు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

శ్రీలీల సినిమాల సంగతికి వస్తే ఇటీవలే భగవంత్ కేసరి సినిమాలో విజ్జీ పాపగా తన నటనతో అందర్నీ ఫిదా చేసింది. ఇక ఇప్పుడు వరుస సినిమా రిలీజ్​లతో బిజీగా ఉంది. స్కంద సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా ఈ భామ అందం, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ నెలల వైష్ణవ్ తేజ్​తో కలిసి నటించిన ఆదికేశవ రిలీజ్​కు సిద్ధంగా ఉంది. ఇవే కాకుండా మహేశ్ బాబుతో గుంటూరు కారంలో సందడి చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news