నేడు తెలంగాణకు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ

-

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచాారాన్ని హోరెత్తిస్తోంది. ఓవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరోవైపు రాష్ట్ర మంత్రులు, ఇంకోవైపు జాతీయ నేతలు రంగంలోకి దిగి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆరు గ్యారంటీల అమలును ప్రజలకు వివరిస్తూ.. ఎన్నికల మేనిఫెస్టోను కూడా గ్యారంటీల మాదిరి అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ రాష్ట్రానికి కాంగ్రెస్ కీలక నేతలు రానున్నారు.

నేడు రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్‌లో మల్లికార్జున ఖర్గే మీడియాతో మాట్లాడతారు. సాయంత్రం నకిరేకర్‌లో జరిగే జనజాతర సభలో పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈరోజు ఉదయం పఠాన్‌చెరులో కార్నర్‌ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం మక్తల్‌లో జరిగే జన జాతరసభలో పాల్గొననున్నారు. సాయంత్రం షాద్‌నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంకగాంధీతో కలిసి సీఎం రేవంత్‌ పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version