తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార వేగాన్ని మరింత ముమ్మరం చేశారు. మరో 48 గంటలే గడువు ఉన్నందున ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మాదిరి పార్లమెంట్ ఎలక్షన్స్ ఫలితాల్లోనూ తమ హవా కొనసాగించాలని భావిస్తోంది. ఇందుకోసం తీవ్రంగా శ్రమిస్తోంది.
ఈ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పార్టీ పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు జాతీయ నేతలను రంగంలోకి దింపి వారితో ప్రచారం చేయిస్తున్నారు. ఇక ఈరోజు కూడా రేవంత్ ప్రచారంలో బిజిబిజీగా ఉండనున్నారు. ఈరోజు ఉదయం పఠాన్‌చెరులో కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి సాయంత్రం మక్తల్‌లో జరిగే జన జాతరసభలో పాల్గొననున్నారు. సాయంత్రం షాద్‌నగర్ కార్నర్ సమావేశంలో ప్రియాంక గాంధీతో కలిసి సీఎం రేవంత్ పాల్గొంటారని పీసీసీ వర్గాలు తెలిపాయి.