ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తాం : మల్లికార్జున ఖర్గే

-

ఇచ్చిన హామీల మేరకు పథకాలు అమలు చేశామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఏదైతే చెబుతామో అది కచ్చితంగా చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అధిక విడతల్లో ఎన్నికల నిర్వహణ ఎవరికీ ఉపయోగం లేదని విమర్శించారు. ఎన్నికల కమిషన్‌ విధానాల మేరకు అందరూ నడుచుకోవాలని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించిన ఖర్గే హీజేపీ, బీఆర్ఎస్లపై తీవ్ర విమర్శలు చేశారు.

‘చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుని బీజేపీ ఓట్లు అడగదు. కాంగ్రెస్‌పై నిందలు మోపడం ద్వారా ఓట్లు అడుగుతారు. కాంగ్రెస్‌ తమకు పోటీయే కాదంటూనే పదే పదే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు భయపడుతున్నందునే పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. నల్లధనం వెలికితీస్తామని ఎన్నో ప్రగల్భాలు పలికారు. నల్లధనం ప్రయోజనాలు తన మిత్రులకే అందజేశారు. ఎన్నికల ప్రకటన తర్వాత అదానీ, అంబానీ గురించి మాట్లాడట్లేదంటున్నారు. టెంపోల్లో కాంగ్రెస్‌ నేతలకు డబ్బులు ముడుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఎక్కడి నుంచి డబ్బులు ఎక్కడికి ముడుతున్నాయో మీరు ఎప్పుడు చూశారు? డబ్బులు టెంపోల్లో తరలిస్తుంటే ఐటీ, కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి?’ అని ఖర్గే ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news